ఇండిగో విమానంలో బాంబు కలకలం…తన్నుకున్న ప్రయాణికులు !

-

ఇండిగో విమానంలో బాంబు కలకలం రేపింది. ఈ తరుణంలోనే…ఓ ప్రైవేటు విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం బాంబు బెదిరింపుల వరకు వెళ్లింది. కొచ్చి నుంచి చెన్నై వస్తున్న ప్రైవేటు ప్యాసింజర్ విమానంలో టేకాఫ్ అవుతుండగా..ఓ విదేశీ ప్రయాణికుడితో పాటు ఇద్దరు వ్యక్తులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

There was a fight between two passengers in the flight from Kochi to Chennai

దీంతో బాంబు పెడతామని బెదిరించాడు మరో ప్రయాణికుడు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి దాదాపు 3 గంటల పాటు తనిఖీలు చేశారు అధికారులు. అయితే… బాంబులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. కానీ మా దగ్గర బాంబు ఉంది… పేల్చేస్తామని బెదిరింపులు చేశారు ఆ ఇద్దరు ప్రయాణికులు. కానీ తనిఖీలు చేసి బాంబు లేదని నిర్దారించిన అధికారులు.. బాంబు బెదిరింపులకు పాల్పడిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news