రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్న తరుణంలో వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు ఓ లారీ ఆటోలపై బోల్తా కొట్టింది.ఈ ప్రమాదంలో ఆటోలలో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
లారీలో ఓవర్ లోడుతో తెస్తున్న ఐరన్ పట్టాలు ఆటోలపై పడటం వల్లే ఈ విషాదం నెలకొంది. వరంగల్–మామునూరు శివారులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారి సైతం మరణించినట్లు సమాచారం.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. లారీ బోల్తా పడటానికి ఓవర్ లోడ్ కారణమని తెలుస్తోంది. రెండు ఆటోలపై ఒక్కసారిగా ఐరన్ పట్టాలు పడటంతో మరణాల సంఖ్య పెరిగింది.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ
చిన్నారితో సహా ఏడుగురు మృతి
వరంగల్ – మామునూరు భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఆటోను ఢీ కొట్టిన రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ
ఆటోపై పడ్డ రైలు పట్టాలు.. ఏడుగురు మృతి, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
రైలు పట్టాల కింద ఇరుక్కున్న మరికొందరు… pic.twitter.com/qEtx6GZ6w5
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2025