ప్రవీణ్ కుమార్ కు వెంట్రుకలే కాదు.. బ్రెయిన్ కూడా లేదు : డోర్నకల్ ఎమ్మెల్యే

-

ప్రవీణ్ కుమార్ పిచ్చి ఎక్కి మాట్లాడుతుండు. ఆయన ఆయన Rs ప్రవీణ్ కుమార్ కాదు పిచ్చి ప్రవీణ్ అని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. ఆయనకు తలపై వెంట్రుకలే కాదు.. లోపల బ్రెయిన్ కూడా లేదు. కేసీఆర్, కేటిఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తుండు. అందుకే పార్ములా ఈ కార్ రేసులో సీఎం రేవంత్ రెడ్డి పై కేసు పెట్టాలని అంటుండు. కేసీఆర్ గడీలు, ఫామ్ హౌస్ బద్దలు కొడతామని.. ఈ రోజు వాళ్ళు మీకు మంచి అయ్యారా అని ప్రశ్నించాడు.

Bsp పార్టీలో చేరి ఆ పార్టీ నిధులు ఏవిధంగా స్వాహా చెసిండో అందరికి తెలుసు. మిమ్ముల్ని నమ్మిన దళిత, గిరిజన బహుజ బిడ్డలను మోసం చేసిండు. కేసీఆర్ ఇచ్చే డబ్బుకు కక్కుర్తి పడి పార్లమెంట్ సీటు కోసం నమ్ముకున్న దళిత బహుజన బిడ్డలను నట్టేట ముంచారు. పోలీసు అధికారి గా స్వెరోస్ స్థాపించి ఏ విధంగా గురుకులాలను బ్రష్టు పట్టించాడో తెలుసు. కేటిఆర్ ఫార్ములా ఈ కార్ రేసులో ఎలాంటి అనుమతి లేకుండా విదేశాలకు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి కారణంగా నే పార్ములా ఈ కార్ రేసులో రాష్ట్రానికి నష్టం వచ్చిందని సిగ్గులేకుండా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతుండు అహర్నిశలు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం కోసం కష్ట పడి పని చేస్తుండు. ఇప్పటికైన rs ప్రవీణ్ కుమార్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే ప్రజలు మిమ్ముల్ని తరిమి కొడతారు అని డోర్నకల్ ఎమ్మెల్యే సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news