తిరుపతిలోని సీనియర్ సిటిజన్ మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశాం. వైజాగ్ కేంద్రంగా కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫోన్లు ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాము అని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వారిపై నిఘా ఉంచి కేసు దర్యాప్తు ప్రారంభించాం. విచారణలో దాదాపు 3.5 కోట్ల సైబర్ క్రైమ్ జరిగినట్లు గుర్తించాం. ఇన్వెస్టిగేషన్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని ఓ మహిళకు ఫోన్ చేసి ఫోన్ వాట్సాప్ కాల్ చేసి ఢిల్లీ సిబిఐ అధికారుల అంటూ 200 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగినట్లు భయపెట్టారు.
సదరు మహిళ పైన ఉన్న బ్యాంక్ అకౌంట్ ను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించినట్లు చెప్పడంతో భయపడింది మహిళ. ఇక భయపడినటువంటి మహిళ వద్ద నుండి 2.5 కోట్ల రూపాయలు ముద్దాయిలు దండుకున్నారు. డబ్బులు తీసుకెళ్లాక ఫోన్ కాల్ రాకపోవడంతో మహిళకు అనుమానం వచ్చింది. తిరుపతి పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు.. మహిళ ఇచ్చిన వివరాల ప్రకారం దర్యాప్తు నిర్వహించాం. విచారణలో విశాఖకు చెందిన ఏడు మంది ముద్దాయిలను అదుపులో తీసుకున్నాం. వారి వద్ద నుంచి ఒక కారు, 10 లక్షలు విలువ చేసే బంగారు, 32.5 లక్షల రూ నగదు, ఒక సిమ్ మాడ్యులర్, 8 రూటర్స్ ను స్వాధీనం చేసుకున్నాం అని హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు.