మీర్పేట్ మాధవి కేసును వివరించిన సీపీ..!

-

మీర్పేట్ మాధవి కేసును వివరించారు సీపీ. ఈనెల 16న ఉదయం 8 గంటలకు భార్య వెంకట మాధవి తో గురుమూర్తి కి గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన గురుమూర్తి.. మాధవి ని బలంగా కొట్టాడు. గోడకు వేసి అదిమాడు. మాధవి చనిపోయేవరకు గట్టిగా అధిమిపట్టాడు. చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత.. మాధవి మృతదేహాన్ని మాయం చేయాలి అనుకున్నాడు. ఒక్క ఆధారం కూడా దొరకకుండా మాధవి మృతదేహాన్ని డిస్పోస్ చేయాలని ప్లాన్ చేసాడు. మృతదేహాన్ని బాత్రూం లోకి తీసుకెళ్ళాడు. మాధవి ఒంటిపై ఉన్న దుస్తులు అన్నీ తీసి బెడ్ రూం లో వేశాడు. కిచెన్ లో నుండి కత్తి తీసుకొని వచ్చి.. మాధవి భుజాలను కట్ చేశాడు. డెడ్ బాడీ నుండి చేతులను వేరు చేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీ నుండి కాళ్లను కూడా వేరు చేశాడు. వాటిని ముక్కలు ముక్కలుగా చేసి బకెట్లో వేశాడు.

ఆ బకెట్లో వాటర్ హీటర్ పెట్టాడు. అందులో శరీర భాగాలు ఉడికిన తర్వాత బకెట్లోంచి ఆ భాగాలను తీసి స్టవ్ పై ఉంచాడు. ఎముకలను రోటిలో దంచి పౌడర్ చేశాడు. ఆ పౌడర్ ను బాత్రూంలోకి వెళ్లి అనేక సార్లు ఫ్లెష్ చేశాడు. మరికొన్ని చిన్నచిన్న ఎముకలను డస్ట్ బిన్ లో ఉంచాడు. ఆ తర్వాత డిటర్జెంతో పాటు ఫినాయిల్ ఉపయోగించి ఎవిడెన్స్ లేకుండా చేశాడు గురుమూర్తి. ఈ ఘటనలో స్టవ్, కత్తి, రోలర్, రోలర్ స్టోన్, బకెట్, వాటర్ హీటర్, మాధవి దుస్తులు, హత్య సమయంలో గురుమూర్తి వేసుకున్న దుస్తులు, ఫినాయిల్ బాటిల్, రూం ఫ్రెష్ణర్, సర్ఫ్ ప్యాకెట్, యాసిడ్ బాటిల్, డోర్ మ్యాట్, చెత్త బకెట్, బైక్, రెండు మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాము అని సీపీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news