కేటిఆర్ ధర్నా అని కామెడీ షో నిర్వహించిండు : బీర్ల ఐలయ్య

-

కేటిఆర్ నల్లగొండ లో రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించిండు. నల్లగొండలో రైతు ధర్నా అట్టర్ ప్లాప్ అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ధర్నాకు మద్దతు తెల్పలేదు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండను తీర్చి దిద్దుతున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేసిండు. కేటిఆర్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.

ఈ ఫార్ములా కార్ రేసులో అడ్డంగా దొరికి పోయిన దొంగ కేటిఆర్. దొంగే దొంగ అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పై కేసు పెడుతున్నారు. కేటిఆర్ జైలుకు పోవడం ఖాయం. కాబట్టి వ్యక్తి గత ఇమేజ్ కోసం రైతులను వాడుకోవాలని కేటిఆర్ చూస్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల తో పాటు రైతు కూలీలను ఆదుకుంటుంది. నల్లగొండ నుండే కేటిఆర్ పతనం స్టార్ట్ అయింది అని బీర్ల ఐలయ్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news