ఆర్.ఎస్.ప్రవీణ్ మనస్తత్వం అందరికీ తెలుసు.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఆర్.ఎస్.ప్రవీణ్ మనస్తత్వం అందరికీ తెలుసు.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతున్నదని సీఎం పై కేసు నమోదు చేసి విచారించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  స్పందించారు. ఇవాళ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం బదులిస్తూ ఫిర్యాదు చేసిన వ్యక్తి బానిస మనస్తత్వం, ఆలోచన విధానం అందరికీ తెలుసన్నారు. ఏదో ఒక రోజు ఆ బానిస సంకెళ్ల నుంచి తెంచుకోవాలని కోరుకుంటున్నానన్నారు.

ఏడాది క్రితం ఆయన ఏం మాట్లాడారు? ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఎవరి కోసం తాపత్రాయ పడుతున్నారు అందరం చూస్తున్నామన్నారు. ఈ ఫిర్యాదు ద్వారా అసలు విషయం పక్కదారి పట్టించాలని అనుకుంటే అది వారి భ్రమ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారు రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి లండన్ లో పెట్టుబడులు పెడితే మేము ప్రజల కోసం విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news