సమగ్ర సర్వే సక్సెస్​.. అధికారులను అభినందించిన సీఎం..!

-

రాష్ట్రంలో విజయవంతంగా పూర్తయిన సమగ్ర కుల గణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే పై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.

ఈ కుల గణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కుల గణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటేడ్ కమిషన్ కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయని అన్నారు. సర్వే డేటా ఎంట్రీ పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో ముసాయిదా నివేదికను సమర్పిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫిబ్రవరి 2వ తేదీ లోగా కేబినెట్ సబ్ కమిటీ కి తుది నివేదికను అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news