సహజంగా ప్రతి ఒక్కరికి నిద్రపోయిన తర్వాత కలలు వస్తూ ఉంటాయి. అయితే ఆ కలలు రావడానికి కొన్ని రకాల కారణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల కలలు మన భవిష్యత్తు గురించి చెబుతాయి. ముఖ్యంగా భవిష్యత్తులో జరిగే అరిష్టమైన విషయాల గురించి కలలు చెబుతాయి. అయితే కొంతమంది కలలో కాకులను చూస్తూ ఉంటారు. ఈ విధంగా కలలో కాకి కనబడితే అది అశుభమని గుర్తుంచుకోండి. ఏదైనా భారీ ప్రమాదాన్ని ఇవి సూచిస్తాయి. ఇటువంటి కలలు వచ్చినప్పుడు ఎవరి మరణ వార్త అయినా వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని పండితులు చెబుతున్నారు.
కలలో కాకిని చూస్తే మీ జీవితంలో కూడా ఎంతో మార్పుని చెందుతారు అని అర్థం చేసుకోవాలి. ఇటువంటి కలలు వచ్చినప్పుడు తర్వాత రోజు ఉదయాన్నే శని దేవుడిని దర్శించుకోవాలి అని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విధంగా శని దేవుడిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది. అలాగే మీ కలలో నల్లని వస్త్రాలు మరియు నల్లని వస్తువులు వంటివి కనుక వస్తే అవి అనారోగ్యాన్ని సూచిస్తున్నట్టు అర్థం. కొంతమందికి నిద్ర పోయినప్పుడు కలలో తుఫాను లేక ఇల్లు కూలిపోతున్నటువంటి సంఘటనలు కనిపిస్తాయి. ఇటువంటి కలలు వచ్చినప్పుడు ఎంతో నష్టాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
చంద్రగ్రహణం లేక సూర్యగ్రహణం వంటి దృశ్యాలు మీ కలలో కనిపించినట్లయితే అది అశుభంగా భావించాలి. ఇటువంటి కల వచ్చినప్పుడు వారి జీవితంలో ఎంతో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అడవి జంతువులు వెంబడిస్తున్నట్లు కలలో వస్తే ప్రతికూల ఫలితాలకు సంకేతం. పైగా ఇటువంటి కలలు ఆర్థిక నష్టాన్ని సూచిస్తాయి. మీ కలలో ఎలాంటి శబ్దాలు అయిన విన్నట్లయితే అది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వివాదానికి చిహ్నంగా భావించాలి.