Kerala Liquor Scam: కల్వకుంట్ల కవితపై కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ కు చెందిన ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం తరహాలోనే కేరళలో కూడా లిక్కర్ స్కాం జరిగిందని బాంబ్ పేల్చారు ప్రతిపక్ష నేత వీడీ సతీశన్. ఇందులో కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణలు చేశారు.
పాలక్కడ్ లోని ఒయాసిస్ కంపెనీకి మద్యం తయారీ కోసం సీఎం పినరయి, ఎక్సైజ్ మంత్రి ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారని ఆరోపణలు చేశారు ప్రతిపక్ష నేత వీడీ సతీశన్. ఈ మొత్తం వ్యవహారాన్ని కల్వకుంట్ల కవిత కేరళకు వచ్చి నడిపించారని బాంబ్ పేల్చారు కేరళ శాసన సభ ప్రతిపక్ష నేత వీడి సతీశన్. దీంతో.. కల్వకుంట్ల కవిత మరోసారి కొత్త చిక్కుల్లో పడ్డారు.