ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు మరో యువకుడు బలయ్యాడు. ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎంతో మంది అవగాహన కల్పించినా కొందరు యువకులు పెడచెవిన పెడుతున్నారు. తీరా ఆ యాప్స్ ఎంత ప్రమాదమో తెలుసుకునే లోపు విలువైన ప్రాణాలు పోతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని గద్దపాక గ్రామానికి చెందిన బూస కార్తీక్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
స్థానికుల కథనం ప్రకారం..బిహార్ నుంచి కూలీలను తీసుకువచ్చి వరి నాట్లు వేయించే కార్తీక్..గత కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అయ్యాడు.దీంతో పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోయిన కార్తీక్.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపం చెంది గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.