రాబోయే రోజుల్లో విజయం మనదే.. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలన్నారు మాజీ సీఎం కేసీఆర్. తాజాగా జహీరాబాద్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడదాం.. మీరంతా తరలిరండి. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే అని తెలిపారు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్ళకి చూపించి మెడలు వంచుతాం.
కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది. నేను చెప్పిన ప్రజలు వినలేదు..అత్యాశకు పోయి కాంగ్రెస్ కి ఓటేశారు. రైతు బంధుకి రాం రాం, దళితబంధుకి జై భీం చెబుతారని ఆనాడే చెప్పాను. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కి ఓటేశారు. గురుకులాల్లో చదువు అగమ్య గోచరమైంది. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ముంచింది.