గద్దర్ గురించి మరో మాటెత్తితే ఆ ఆఫీస్ ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మరోసారి గద్దర్ ని అవమానిస్తే.. మీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దర్ అన్న పేరు పెడతానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గద్దరన్నను గేట్ బయట పెట్టిన ఆయనకు ఎలాంటి గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో.. మేమే పద్మ అవార్డులను ఇచ్చేది అనుకుంటున్నారేమో.. మేము అవార్డులను అడగం.
రాహుల్ గాంధీ ప్రధాని అయిన తరువాత గద్దరన్నకు ఇచ్చుకుంటామని తెలిపారు. గోరటి వెంకన్న నాతో విభేదించిన ప్రజలతో మమేకమై ఉన్నారు. కేంద్రం తన తప్పును సవరించుకుంటుందని భావించాం. గద్దర్ కు మేము అవార్డులు ఇవ్వమని కేంద్ర మంత్రి చెప్పడం దురదృష్టకరమన్నారు. ఇంతకు ముందు అధికారంలో ఉన్నాయన మీలాగే నీలిగాడు.. ఎండలో గద్దరన్నను నిలబెట్టాడు అని గుర్తు చేశారు. గదరన్నపై అవాకులు చెవాకులు చెబితే సహించేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.