తల్లి శవంతో వారం రోజులు ఇద్దరు కూతుళ్లు సహజీవనం !

-

తల్లి శవంతో వారం రోజులు ఇద్దరు కూతుళ్లు సహజీవనం చేసిన సంఘటన హైదరాబాద్‌ జరిగింది. హైదరాబాద్‌ నగరంలోని వారసిగూడలో దారుణమైన ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. లలిత అనే 50 ఏళ్ల మహిళ ఇంట్లో గుండెపోటుతో మరణించింది. అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 8 రోజుల పాటు ఆమె మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది.

Two daughters cohabited with the mother’s corpse for a week

ఆ మహిళ ఇద్దరు కుమార్తెలు కూడా 8 రోజుల గా ఆమె మృతదేహంతోనే జీవించారు. తర్వాత స్థానిక ఎంఎల్ఏ దగ్గరకి సహాయం కోసం వెళ్లారు. ఎమ్మెల్యే పద్మారావు పోలీసులకు ఫోన్ చేసి ఓ మహిళ గుండె పోటు తో మృతి చెందారు అంటూ సమాచారం అందించారు. ఇక ఈ సమాచారం తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాని గాంధీ మార్చురీ తరలించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news