సన్యాసిగా మారిన హీరోయిన్ మమతా కులకర్ణికి బిగ్ షాక్ తగిలింది. మహామండలేశ్వర్ పదవి నుంచి మమతా కులకర్ణిని తొలగించింది కిన్నర్ అఖాడా. మతపెద్దలు, అఖాడాల నుంచి అభ్యంతరాలు రావడం వల్లే.. ఆమెను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
మమతాను అఖాడాలో చేర్పించిన డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి సైతం తొలగించారు. అఖాడాలో చేరిన మొదట్లోనే మహామండలేశ్వర్ హోదాను మమతాకు ఇవ్వడంపై వ్యతిరేకత ఎదురైంది.
ఆధ్యాత్మిక కార్యక్రమైన కుంభమేళాలో కొందరు అసభ్యతని ప్రోత్సాహిస్తున్నారని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే.. మమతా, లక్ష్మీనారాయణ్లపై బహిష్కరణ వేటు పడిందని సమాచారం. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.