కేంద్ర బడ్జెట్ 2025-26.. స్పెషల్ హైలెట్స్ మీకోసం

-

కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం నిరవధికంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా విద్య, ఆహారం,టెక్నాలజీ రంగంలో రాబోయే రోజుల్లో తీసుకురానున్న మార్పులపై నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కొన్నిరంగాలకు మొండిచేయి ఇవ్వగా.. కొన్ని రంగాలకు మాత్రం శుభవార్త చెప్పారు. అవెంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

‘పత్తి ఉత్పాదకత పెంచేందుకు స్పెషల్‌ మిషన్‌.. అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు.. అన్ని ప్రభుత్వ స్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు.. పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు.. ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం.. విద్యారంగంలో AI వినియోగం.. ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్‌ సీట్లు.. బీహార్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ.. రూ.30 వేలతో స్ట్రీట్‌ వెంటర్స్‌కు క్రెడిట్ కార్డులు.. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం’ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news