చలికాలం చల్లగా ఉంటుందనే కానీ.. చాలా చిరాగ్గా ఉంటుంది కదా..! సాయంత్రం సరదగా బయటతిరుగుదాం అంటే ఒకటే చలి, ఈ చలికి స్కిన్ కూడా ముడతలు ముడతలుగా అవుతుంది. స్కిన్ సాఫ్ట్‌నెస్ కోల్పోతుంది. అసలు మీ చర్మం మీద మీకే అసహ్యం అనిపిస్తుంది. మాయిశ్చరైజర్స్ రాసినా.. అవి అప్పటిమందమే ఉంటుంది. క్రీమ్స్ రాస్తే.. ఇంకా జిడ్డుగా అవుతుంది స్కిన్. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ఈ ఫేస్ ప్యాక్‌లను క్రమం తప్పకుండా ఉపయోగించండి. రఫ్ స్కిన్ సమస్య తొలగిపోతుంది.
చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచే ఫేస్ ప్యాక్‌లు..
మీరు పాల ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. ఈ సమయంలో చర్మ రంధ్రాలలో మురికి పేరుకుపోతుంది. ఒక గిన్నెలో బేసన్ తీసుకోండి. దానికి పాలు కలపండి. బాగా కలపండి. ఈ ప్యాక్‌ని మీ ముఖానికి అప్లై చేయండి. అది ఆరిపోయాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఫేస్‌లో తేమ ఎప్పటికీ ఉంటుంది. స్కిన్ హెల్తీగా కనిపిస్తుంది.
అరటిపండు ప్యాక్ వేసుకోవచ్చు. అరటిపండును బాగా మగ్గించండి. దానికి తేనె కలపండి. బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్‌ని మీ ముఖానికి అప్లై చేయండి. అది ఆరిపోయాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం సాఫ్ట్‌గా అవుతుంది. మీ ముఖంపై ఏమైనా మచ్చలు ఉన్నా పోతాయి.
మీరు ఈ వింటర్ సీజన్‌లో బాదం ప్యాక్‌ని తయారు చేసుకోవచ్చు. బాదంపప్పులను బాగా రుబ్బుకోవాలి. దానికి పాలు కలపండి. ఒక ప్యాక్ తయారు చేసి మీ ముఖానికి అప్లై చేయండి. పొడిగా ఉన్నప్పుడు, మసాజ్ చేసి క్లీన్ చేసుకోండి. మంచి ప్రయోజనం పొందుతారు.
కలబంద మరియు పసుపుతో ప్యాక్‌ను తయారు చేయండి. అలోవెరా జెల్‌తో పసుపు పేస్ట్ కలపండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ప్యాక్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పొడిగా ఉన్నప్పుడు, రుద్ది కాసేపు ఉంచండి. ఆ తర్వాత క్లీన్ చేసుకోండి. ఇది చర్మం యొక్క కరుకుదనాన్ని తొలగిస్తుంది. మృదువుగా చేస్తుంది.