బీఎస్ఎన్ఎల్ సంచలనం నిర్ణయం.. ఆ మూడు పాపులర్ ప్లాన్స్ తొలగింపు

-

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కు వినియోగదారులు క్రమంగా పెరుగుతున్నారు.ఇతర దిగ్గజ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్ సంస్థలు తమ టారిఫ్ ప్లాన్ల రేట్లను క్రమంగా పెంచుకుంటూ వెళ్తుండటంతో జనాలు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే యూజర్లను మరింత ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. తాజాగా BSNL తన కోట్లాది మంది వినియోగదారులకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రీపెయిడ్ పోర్టు ఫోలియో నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మూడు ప్లాన్లను తొలగించనుంది. ఈ నెల 10 తర్వాత యూజర్లకు ఆ ప్లాన్లు అందుబాటులో ఉండవని తెలిపింది. రూ. 201 ప్లాన్, రూ.797, రూ.2999 ప్లాన్లు ఇక ముందు కనిపించవు అని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.201కు 90 రోజుల వ్యాలిడిటీ, రూ.797కు 60 రోజులు, రూ.2999కు 365 రోజుల వ్యాలిడిటీ, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సదుపాయాలు సైతం ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news