ఎమ్మెల్యేల సీక్రెట్ భేటీ.. సీఎంకు ఎమ్మెల్యే నాయిని లేఖ

-

కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒకరిద్దరు జిల్లా మంత్రుల వ్యవహారంలో గుస్సతో ఉన్న ఎమ్మెల్యేలు సుమారు 10 మంది కలిసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్లో రహస్యంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. విషయం తెలిసి సీఎం రేవంత్ ఎమర్జెన్సీ కేబినెట్ మీటింగ్ సైతం నిర్వహించి కొందరు మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో ముందుకు వెళ్లాలనని సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉన్నందున సీఎం రేవంత్ సైతం పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తాను ఎమ్మెల్యేల రహస్య భేటీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. కావాలనే కొందరు ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు. పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.యూట్యూబర్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన నాయిని రాజేందర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ ను ఈ విషయంలో కలిసి ఫిర్యాదు చేస్తానని, అందుకోసం లేఖ రాసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news