ఏపీ సీఎం చంద్రబాబు ల్యాండ్‌ కబ్జా !

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో ఉన్న ఒక ల్యాండ్ ను కబ్జా చేసేందుకు కొంతమంది కుటుంబ పన్నారు. బాపట్ల నియోజకవర్గంలో టిడిపి కార్యాలయం కోసం.. చంద్రబాబు పేరుతో మువ్వ సుబ్బారావు అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సంఘటన 2000 సంవత్సరంలోనే జరిగింది.

chandrababu

అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ స్థలం ఖాళీగానే ఉంది. దీంతో… కబ్జాదారులు ఆ స్థలంపై కన్నివేశారు. 2010 సంవత్సరంలోనే నకిలీ రిజిస్ట్రేషన్ చేసుకొని.. పేరు మార్చుకున్నారని సమాచారం. నక్క సత్తార్ రెడ్డి అనే వ్యక్తి ఈ ల్యాండ్ కబ్జా చేసినట్లు సమాచారం. దొంగ డాక్యుమెంట్లు పెట్టి… సత్తార్ రెడ్డి.. కొంతమందితో కలిసి కుట్రలు చేశారట. అయితే బాపట్లలో టిడిపి కార్యాలయాన్ని కట్టాలని తాజాగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… ఈ స్థల వివాదం తెరపైకి వచ్చింది. దీంతో నక్క సత్తార్ రెడ్డిని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news