గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

-

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన గ్రేటర్ హైదరాబాద్ బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మోకిల పోలీసుల కథనం ప్రకారం.. శంకర్పల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి చెందిన ముత్తంగి శ్రీనివాస్ (34) సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఎలిమెల గ్రామంలో ఆదివారం బీరప్ప జాతర కోసం అతని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు.

జాతర ముగించుకొని నిన్న రాత్రి శంకర్ పల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి తిరిగి వస్తుండగా కొండకల్ సమీపంలో గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది.దీంతో స్పాట్‌లోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.కాగా, మృతుడు రాష్ట్రంలోని ఓ ఎమ్మెల్యేకు గన్ మెన్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news