నా కొడుకును మీరే చంపారు : మంత్రి పొంగులేటికి షాక్

-

మంత్రి పొంగులేటికి బిగ్ షాక్ తగిలింది. నా కొడుకును మీరే చంపారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బాధిత తండ్రి నిలదీశాడు. నా 25 ఏళ్ల కొడుకును పది మంది వచ్చి దారుణంగా హత్య చేశారని, ఎందుకు చంపారని అడిగితే నిందితులు మీ పేరే చెప్పారంటూ మంత్రి పొంగులేటిని మృతుడి తల్లిదండ్రులు నిలదీశారు.

మేము మీకే ఓటు వేశాం, మాకు న్యాయం చేయకపోతే మందు తాగి చనిపోతామంటూ మంత్రి పొంగులేటి కారుకు బాధితులు అడ్డం పడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news