మన దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందని నాయకులు ఎన్ని గొప్పలు చెప్పినా ఇప్పటికే చాలా వరకు మారుమూల గ్రామాల్లో వీధిదీపాల సదుపాయం, రోడ్ల సదుపాయం, హాస్పిటల్ సౌకర్యాలు మెరుగవ్వలేదు. ప్రభత్వాలు మారుతూ ఉన్నా గిరిజనులు, అటవీ గ్రామాల్లో ఎటువంటి డెవలప్ మెంట్ కనిపించడం లేదు.
ఈ క్రమంలోనే స్వాతంత్రం వచ్చిన 77ఏళ్ల తర్వాత ఓ గిరిజన గ్రామంలో తొలిసారిగా లైట్లు వెలిగాయి.ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా రోలుగుంట (మ) అర్ల పంచాయతీలోని నీలబంద గ్రామంలో మూడు కుటుంబాలు ఉండగా.. అందులో 26 మంది ఉంటున్నారు.
ఈ గ్రామంలో స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. తొలి లైట్ వెలగడంతో గ్రామప్రజలు ఆనందంతో థింసా నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత గిరిజన గ్రామంలో తొలిసారి వెలిగిన లైట్లు
అనకాపల్లి జిల్లా రోలుగుంట (మ) అర్ల పంచాయతీ లోని నీలబంద గ్రామంలో 3 కుటుంబాలు, 26 మంది ఉంటున్నారు
ఈ గ్రామంలో స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత విద్యుత్ సౌకర్యం రావడం, మొదటి లైట్ వెలగడంతో గ్రామ ప్రజలు ఆనందంతో,… pic.twitter.com/UwNVuvR7Ge
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025