అంతర్రాష్ట్ర క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.శనివారం రాత్రి ప్రిజం పబ్ వద్ద ప్రభాకర్ జరిపిన కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ గాయపడిన విషయం తెలిసిందే.రూ.3వేల దొంగతనంతో మొదలైన అతని క్రిమినల్ ప్రయాణం రూ. కోట్లకు చేరింది
చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ప్రభాకర్ 8వ తరగతిలోనే చదువు ఆపేసి దొంగతనాలు మొదలెట్టినట్లు సమాచారం.
జేబు దొంగ నుంచి కోట్లకు పడగెత్తిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్..విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలలో ఉండటం, అమ్మాయిలతో డేటింగ్, స్నేహితుల పేర్లతో రిజిస్టర్ చేయించి హై-ఎండ్ కార్లను వాడేవాడని తెలుస్తోంది. నార్సింగిలోని అతని ఫ్లాట్‌లో రూ.50వేల విలువైన మద్యం,జిమ్ సెటప్, ఖరీదైన గాడ్జెట్‌లను గుర్తించారు.ప్రభాకర్‌పై ఐదు రాష్ట్రాల్లో 80కు పైగా కేసులు ఉన్నాయి.అతని వద్ద నుంచి 4 తుపాకీలు, 450 బులెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.