నాకు ఎవరు ఛాలెంజ్ కాదు.. నాకు నేనే ఛాలెంజ్ : బాలకృష్ణ

-

నందమూరి నటసింహం,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.పద్మభూషణ్ అవార్డు రావడం నాలో ఇంకా కసిని పెంచిందన్నారు. నాకెవరూ ఛాలెంజ్ కాదు… నాకు నేనే ఛాలెంజ్ అని హాట్ కామెంట్స్ చేశారు. త్వరలోనే ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని జోస్యం చెప్పారు. ఇక వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ చైర్‌పర్సన్ ఇంద్రజ రాజీనామా చేశారని, వైసీపీతో విసిగిపోయి ఆ పార్టీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారన్నారు. నియోజకవర్గంలోని ప్రతివార్డుకు మంచి నీటిని అందిస్తామని, కావాల్సిన నిధులు కేటాయిస్తామన్నారు.

మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్‌ను మార్చి క్లీన్ అండ్ గ్రీన్‌గా మారుస్తామన్నారు. హిందూపురం అభివృద్ధికి కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని తెలిపారు.కియా పరిశ్రమ రావడంతో… ఇటు హిందూపురానికి అనేక పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. పద్మభూషణ్ అవార్డు వచ్చినా నటుడిగా నాకు సంతృప్తి కలగలేదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news