తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు గొంగడి త్రిష. కాసేపటి క్రితమే… శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అండర్ 19 విమెన్ ప్లేయర్స్ గొంగిడి త్రిష, ద్రితి కేసరి చేరుకున్నారు. టీమ్ హెడ్ కోచ్ నూసిన్, ఫిట్నెస్ ట్రైనర్ శాలిని.. కూడా వచ్చారు. ఈ సందర్భంగా వారికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్వాగతం పలికింది.
కాగా, అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా ఇవాళ సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తుదిపోరులో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. దీంతో అండర్ 19 టీ20 ప్రపంచ కప్ ను భారత్ సునాయసంగా గెలిచింది. త్రిష 7 మ్యాచ్ లలో 309 రన్స్ చేసి భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144 గా ఉండటం విశేషం.
అండర్ -19 టీ20 వరల్డ్ కప్ స్టార్ క్రికెటర్ త్రిషాకు ఘన స్వాగతం పలికిన HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు
HCA President Jagan Mohan Rao extended a grand welcome to the Under-19 T20 World Cup star cricketer Trisha Gongadi pic.twitter.com/jOkMGvBf0N
— Sarita Avula (@SaritaAvula) February 4, 2025