నల్గొండ బీజేపీలో మరోసారి వర్గపోరు బయటపడింది. ఇటీవల బీజేపీ అధిష్టానం రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి పార్టీ ప్రెసిడెంట్గా ఎంపిక చేసినందుకు బీజేపీ సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్టీని మేనేజ్ చేసి ఈ పదవి తెచ్చుకున్నాడని.. అధ్యక్షుడిని వెంటనే మార్చకపోతే పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కమని బీజేపీ సీనియర్లు హెచ్చరించారు. అయితే, నాగం వర్షిత్ రెడ్డి నాయకత్వాన్ని జిల్లాలోని సీనియర్లు అంగీకరించడం లేదు. ఆయన సీనియర్ల అభిప్రాయాలకు విలువనివ్వడం లేదని,ఒంటెద్దు పోకడలకు పోతున్నాడని పలువురు సీనియర్లు ఆరోపిస్తున్నారు.