హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని యాదవ సంఘం సభ్యులు ముట్టడించారు. బుధవారం ఉదయం వారంతా నినాదాలు చేస్తూ బీజేపీ ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు. యాదవులకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల బీజేపీ ప్రకటించిన జిల్లా అధ్యక్షుల జాబితాలో యాదవులకు ఒక్క పదవీ దక్కలేదని వారంత ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ బీజేపీ యాదవులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విషయంపై ఆగ్రహించిన యాదవ సంఘం సభ్యులు నేడు ఉదయం బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.