కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు.తమకు తెలియకుండా ముందస్తు నోటీసులివ్వకుండా భూ సర్వే చేసి ఎలా హద్దులు పాతుతారని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భూసర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్థులు, రైతులు అడ్డుకున్నారు.
కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు వచ్చి సర్వే చేయడం ఎంతవరకు సమంజసమని రైతులు మండిపడుతున్నారు. అయితే, నారాయణ్ పేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం బాపూర్లో చేపట్టిన సర్వే తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. అధికారులు – స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నది. చివరకు చేసేది లేక భూసర్వే చేయకుండానే అధికారులు వెనుతిరిగారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు
నారాయణ్ పేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం బాపూర్లో చేపట్టిన సర్వేలో ఉద్రిక్తత
భూసర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు, రైతులు
తమకు తెలియకుండా ముందస్తు నోటీసులివ్వకుండా భూసర్వే చేసి ఎలా హద్దులు… pic.twitter.com/EGXy6TbBDW
— Telugu Scribe (@TeluguScribe) February 5, 2025