తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బుధవారం రోజున 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని అధికారిక ప్రకటన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/thummnala.jpg)
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక ఎకరం వరకు, సాగులో ఉన్న భూములకు రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. పథకం ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈరోజు వరకు రూ 1126.54 కోట్లు జమ చేశామన్నారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.