Pushpa 2: కుంభ మేళా లో పుష్ప వైల్డ్ ఫైర్

-

కుంభమేళాలో పుష్ప-2.. తగ్గేదేలే అంటున్నాడు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 25వ రోజుకు చేరింది. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తాజాగా మహా కుంభమేళాలో అల్లు అర్జున్ పుష్ప-2 గెటప్‌తో ఓ అభిమాని సందడి చేశాడు. తగ్గేదేలే అంటూ పుష్పరాజ్‌ను దించేశాడు.

pushpa in Maha kumbha Mela 2025

ఇక, ఆ వ్యక్తితో సెల్ఫీలు దిగేందుకు అంతా పోటీ పడగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అటు మహాకుంభమేళాలో గ్రేట్‌ ఖలీ రచ్చ చేస్తున్నాడు. తాజాగా ప్రయాగ్‌ రాజ్‌ వెళ్లి ఖలీ… అక్కడ పుణ్య స్నానాలు ఆచారించాడు. అయితే.. ప్రయాగ్‌ రాజ్‌ కు కారులో వెళ్లిన ఖలీని చూసేందుకు అక్కడి జనాలు ఎగబడ్డారు. ఖలీతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అయితే.. తన అభిమానులు సెల్పీలు అడగగానే… ఓపికగా వారి సెల్పీలకు ఫోజులు ఇచ్చాడు ఖలీ.

Read more RELATED
Recommended to you

Latest news