బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన కేటీఆర్.. ఆయనకు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీ సీట్ల విషయమై వినతి పత్రం అందజేశారు.
యూజీసీ కొత్త నిబంధనలపై కేంద్ర విద్యా శాఖ మంత్రిని కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. కొత్త నిబంధనల వల్ల మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, నిబంధనలు సవరించి తెలంగాణ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా, కొత్త యూజీసీ నిబంధనల వలన యూనివర్సిటీలకు వీసీలను నియమించే అధికారం రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్తుందని ఇప్పటికే పలువురు విమర్శిస్తున్నారు. కాగా, కేటీఆర్ వినతిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏవిధంగా స్పందిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది.