పైరవీలు చేస్తే పలచ బడతారు : సీఎం రేవంత్

-

పార్టీ MLAలకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేసారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే.. జిల్లా మంత్రి కి చెప్పండి. ఒకవేళ అక్కడ పరిష్కారం కాకుంటే.. నా దగ్గరికి రండి. నా దగ్గర మీరు చెప్పొద్దు అనుకుంటే.. ఏఐసీసీ నాయకులకు చెప్పండి. అది కూడా కుదరు అనుకుంటే.. నేను రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇప్పిస్తా.. వెళ్లి అక్కడ చెప్పండి అని పేర్కొన్నారు.

అదే విధంగా మనం అందరం కుటుంబ సభ్యులం.. అందరికీ తెలివి ఉంటుంది అని చెప్పిన సీఎం.. నమ్మకం, నిజాయితీ అనేవి ముఖ్యం. మన లీడర్ మైండ్ సెట్ అనుసరించి పని చేయాలి. నేను ఆయన కనిసైగల్లో పని చేశా. అందుకే నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది. జైపాల్ రెడ్డి, జానారెడ్డి లాంటి పెద్ద నాయకులకు రాని అవకాశం నాకు వచ్చింది. కాకపోతే పైరవీలు అనేవి చేస్తే మీరు పలచ బడతారు. నా దగ్గరికి కూడా పైరవుల కోసం వస్తున్నారు. అయితే నా దగ్గరికి పైరవీ వచ్చి వెనక్కి వెళ్ళిన్నవే… కొందరు MLAలు మళ్ళీ తీసుకు వస్తున్నారు అని సీఎం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news