రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు నిజంగా అదిరిపోయే శుభవార్త. ఈనెల 26న మహాశివరాత్రి సందర్భంగా సెలవు ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ, 27న కూడా రెండు తెలుగు ప్రభుత్వాలు ఆ రోజున సెలవు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఏపీలో 2 పట్టభదుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వీటిని ఈనెల 27న పోలింగ్ జరగనుంది. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించే చాన్స్ ఉంది.ఏయే జిల్లాల్లో పోలింగ్ ఉండనుందో ఆయా జిల్లాల్లోని పాఠశాలకు సెలవు ఉంటుందని సమాచారం. మార్చి 3న కౌంటింగ్ అనంతరం విజేతలను ప్రకటించనున్నారు.