మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా కాంగ్రెస్ అధిష్టానంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా నిర్వహించిన సీఎల్పీ భేటీలో ఆయన ప్రభుత్వ హామీలు, వాటి అమలు తీరుపై సీరియస్ అయ్యారు.
‘ఎమ్మెల్యేలను, మంత్రులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని, ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు అందరికీ అన్నీ ఇస్తాం అని ఎందుకు చెప్తున్నారు? అని పార్టీ పెద్దలను ప్రశ్నించారు.రైతు భరోసా పథకాన్ని సరిగ్గా అమలు చేయకపోవడంతో గ్రామాల్లో ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పీసీసీ సమావేశంలో తన ఆవేదన వెల్లగక్కారు.