తీన్మార్ మల్లన్న విషయంలో నాకు మాట్లాడేంత టైమ్ లేదు.. అసలు మాట్లాడం వేస్ట్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టీపీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్లు పేపర్లో చూసిన అని ఆయన అన్నారు. అయితే మేము చేసిన సర్వే లో 56.6 శాతం బిసిలు ఉన్నట్లుగా తేల్చినం. బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో పైన తీసుకొని రావడమే మా లక్ష్యం. స్థానిక సంస్థల ఎన్నికల వస్తే ఖచ్చితంగా 42 శాతం పార్టీ పరంగా రిజర్వేషన్లు కలిస్తాం. వర్గీకరణ విషయంలో కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు.
90 శాతం ఉన్న జనాభా కోసమే తెలంగాణ వచ్చింది.. దొరలు, భూస్వాములు, ఫామ్ హౌస్ లో ఉండేందుకు కాదు. ఫామ్ హౌస్ లో ఉంటూ కులగణలో పాల్గొనకుండా ఉన్న వాళ్లకు మాట్లాడే హక్కు లేదు. బీఆర్ఎస్ లెక్క మేము హడావిడిగా సర్వే చేయలేదు.. మేము చేసిన సర్వే ప్రజల ముందు పెట్టాం అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.