రాజ్యసభలో మూసీ పై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

-

రాజ్యసభ సమావేశాలలో భాగంగా శుక్రవారం తెలంగాణ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సభలో మూసీ నది ప్రస్తావనను తీసుకొచ్చారు. దేశంలోని ప్రధాన నదుల్లో మూసీ నది ఒకటని.. దీనిని ముచ్ కందా పేరుతో పిలిచేవారని తెలిపారు. మూసీనది వికారాబాద్ అనంతగిరి కొండల్లో మొదలై హైదరాబాద్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ వద్ద కృష్ణానదిలో కలుస్తుందని వివరించారు. మూసీ నదికి ఎంతో చరిత్ర ఉందని, హైదరాబాద్ మూసీ నది ఒడ్డున నిర్మించారని చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో మూసీ నది నీరు తాగేవారని.. ఎన్నో ఎకరాలకు నీళ్లు అందించిందని చెప్పారు. 

నేడు మూసీ నది పరిస్థితి దారుణంగా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో చెత్త, ఇండస్ట్రీయల్ కెమికల్స్ మూసీ నది వేస్తున్నారని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు ప్రతీ సంవత్సరం జబ్బుల బారిన పడుతున్నారని వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళన నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు. మూసీ నదికి కేంద్రం నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నట్టు వెల్లడించారు. మూసీ నదికి నిధులు కేటాయిస్తే.. ఆ నదికి పునర్జన్మ వచ్చినట్టు అవుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news