కేజ్రివాల్ కు బిగ్ షాక్.. మ్యాజిక్ ఫిగర్ దాటేసింది బీజేపీ. కాసేపటి క్రితమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మాజీ సీఎం కేజ్రీవాల్ వెనకపడ్డారు. 19 కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జంగురాలో మనీశ్ సిసోడియా వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తోంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/bjp-3.jpg)
ఇప్పటి వరకు జితెంధర్ సింగ్(బీజేపీ), మణిందర్ సిర్సా(బీజేపీ), పర్వేశ్ వర్మా (బీజేపీ), సురభ్ భరద్వాజ్ (ఏఏపీ), అమనతుల్లా ఖాన్(ఏఏపీ) ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు బీజేపీ- 37 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఆప్- 26 స్థానాల్లో లీడింగ్ లోకి వచ్చింది. కాంగ్రెస్-01 స్థానంలో మాత్రమే లీడింగ్ లో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో ఆప్ అగ్రనేతలు వెనుకంజలో ఉన్నారు.