విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం.. ప్రభుత్వ స్కూల్లో వాటల్ బెల్ కార్యక్రమం

-

చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలలో వాటల్ బెల్ కార్యక్రమాన్ని మొదలెట్టారు. దీని గురించి ప్రస్తుతం మరోసారి చర్చ జరుగుతోంది.గతంలోనూ ఈ కార్యక్రమాన్ని కొందరు నిర్వహించినా గత కొన్నేళ్లుగా మళ్లీ మూలకుపడింది. తాజాగా
విద్యార్థులు నీళ్ళు తాగేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు.


రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ విద్యార్థుల ఆరోగ్యం కోసం వాటర్ బెల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పాఠశాలకి వచ్చిన విద్యార్థులు ఇంటికి పోయే సమయంలో కనీసం ఒక లీటర్ వాటరర్ ఖచ్చితంగా తాగాలనే కార్యాచరణ రూపొందించారు.ఇలా చేయడం వలన రాబోయే వేసవిలో విద్యార్థులు అనారోగ్యానికి, డీహైడ్రేట్ కాకుండా ఉంటారని, ఇమ్యూన్ పవర్ పెరుగుతుందని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news