గురుమూర్తికి పాలీ గ్రాఫ్ టెస్టులు చేయనున్నారట పోలీసులు. మీర్ పెట్ వెంకట మాధవి హత్య కేసులో ఆమె భర్త గురుమూర్తి కస్టడీ విచారణ కొనసాగుతోంది. గురుమూర్తిని కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు కస్టడీ లోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. వెంకట మాధవిని హత మార్చడంలో గురుమూర్తికి ముగ్గురు సహకరించారన్న అనుమానం తెరపైకి వచ్చింది. భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి ఒక్కడే చంపలేదని అనుమానిస్తున్నారు పోలీసులు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/01/Untitled-1-109.jpg)
గురుమూర్తి తో పాటు మరో ముగ్గురు కలిసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు మహిళలు మరో వ్యక్తి పాత్రపై కష్టడి విచారణ జరుగుతోంది. గురుమూర్తికి సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే గురుమూర్తి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు పోలీసులు. రిమాండ్ రిపోర్టులో గురుమూర్తి a1 గా చేర్చిన పోలీసులు, మరో ముగ్గురు కోసం గాలింపు చేస్తున్నారు. అవసరమైతే గురుమూర్తికి పాలీ గ్రాఫ్ టెస్టులు నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.