కిడ్నీల ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి మీ జీవన విధానాన్ని మార్చుకుంటే ఎంతో మార్పుని పొందవచ్చు. ముఖ్యంగా కిడ్నీల ఆరోగ్యం కోసం మంచి నీరును తీసుకోవడం ఎంతో అవసరం. కేవలం కిడ్నీల ఆరోగ్యం మాత్రమే కాకుండా పూర్తి ఆరోగ్యాన్ని పొందాలి అంటే మంచి నీరును తాగడం చాలా అవసరం. నీరుని తాగడం వలన శరీరంలో ఉండేటువంటి మలినాలు తొలగిపోతాయి. దీంతో కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కిడ్నీల ఆరోగ్యానికి సోడియం అస్సలు మంచిది కాదు. కనుక ఉప్పు ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
సోడియం వలన బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. దీంతో కిడ్నీ సమస్యల ముప్పు మరింత పెరుగుతుంది. కనుక బ్లడ్ ప్రెషర్ ను తరచుగా చెక్ చేసుకుని తగ్గించడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే కిడ్నీల ఆరోగ్యం బాగుంటుంది. మీ రోజు వారి ఆహారంలో భాగంగా పండ్లు, కూరగాయలు తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ముఖ్యంగా తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ వంటివి తీసుకోవడం వలన కిడ్నీకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. కేవలం కిడ్నీల ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా పూర్తి ఆరోగ్యానికి వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం.
వ్యాయామాలను చేయడం వలన కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. చాలా శాతం మంది ప్రోటీన్ తినడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుందని మోతాదుకు మించి తీసుకుంటూ ఉంటారు. అయితే ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉండాలంటే ధూమపానం మరియు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. ఈ విధంగా కిడ్నీల ఆరోగ్యం మాత్రమే కాకుండా పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చు. చాలా శాతం మంది డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు కిడ్నీలకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కొంటారు. కనుక రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా కిడ్నీల ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.