నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే కొందరు వ్యక్తులు కత్తులు చేతులో పట్టుకుని నడిరోడ్డుపై తిరుగుతూ వీరంగం సృష్టించారు. వారిని చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.ఈ ఉదంతాన్ని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అయితే, పాల ప్యాకెట్‌పై ధర ఎక్కువగా తీసుకుంటున్నాడని ఓ షాపు యజమానిపై కత్తులతో దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. కత్తులతో వీరంగం సృష్టించిన వారంతా స్థానికంగా రౌడీ షీటర్లుగా చెలామణి అవుతున్నట్లు సమాచారం. ఇదంతా తెలిసినా తెలియనట్లు పోలీసులు వ్యవహరిస్తున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలానా వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిజామాబాద్ నగరంలో కత్తులతో వీరంగం.
పాల ప్యాకెట్ పై ధర ఎక్కువ ఇస్తున్నావని షాపు యజమానిపై కత్తులతో దాడికి యత్నం.
రౌడీషీటర్లుగా చెలామణి అవుతున్న పట్టింపులేని వైనం.
అన్ని తెలిసి తెలియనట్లుగా పోలీసుల వ్యవహారం. pic.twitter.com/RKPPpbkZzR— ChotaNews App (@ChotaNewsApp) February 10, 2025