బండ్లగూడలో మునిసిపల్ అధికారులు కొరడా ఝళిపించారు. ఫుట్ పాత్ పై వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలు పెట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పాదచారులు నడిచే పుట్ పాత్ ను ఆక్రమించుకొని వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసారు వ్యాపారస్తులు. హైడ్రా కమీషనర్ రంగనాథ్ అదేశాల మేరకు రంగంలోకి దిగారు బండ్లగూడ జాగీర్ మునిసిపల్ అధికారులు. గత కొన్ని సంవత్సరాలు గా ఫుట్ పాత్ కబ్జా చేసారుకబ్జాదారులు.
దాంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారుపాదచారులు. ఫుట్ పాత్ కబ్జా చేయడంలో రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్డు పైనే అక్రమ పార్కింగ్ తో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పాదచారులు, వాహనదారులు. రోడ్డుపై అడ్డంగా వాహనాలు నిలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫుట్ పాత్ కబ్జా చేయడంతో పాదచారుల పైకి దూసుకొని వెళ్లాయి వాహనాలు. రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందారు. దీనిపై సీరియస్ అయిన రంగనాథన్.. అక్రమంగా వెలసిన నిర్మాణాలను జేసీబీ సహాయం తో కూల్చివేతలు మొదలు పెట్టారు.