ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు, రేపు బంద్.. ఎక్కడంటే?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ అలాగే రేపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బంద్ కొనసాగనుంది. అయితే ఈ బందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కేవలం రెండు జిల్లాల్లో కొనసాగనుంది. పార్వతీపురం మన్యం జిల్లా అలాగే అల్లూరి జిల్లాలతో పాటు మరికొన్ని గిరిజన ప్రాంతాల్లో బంద్ కొనసాగనుంది. ఈ బంద్ నకు గిరిజన సంఘాలు పిలుపునివ్వడం జరిగింది.

bandh

పర్యాటక రంగ అభివృద్ధి కోసం 1/70 చట్టాన్ని సవరించాలన్న ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడి పాత్ర పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు అల్లూరి అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలలో బంద్ నకు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ అలాగే రేపు ఈ జిల్లాలలో బంద్ కొనసాగనుంది. మరి కొన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా బంద్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ బంద్ కు వైసిపి పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. దీంతో తెల్లవారుజామున నుంచి బంద్ ప్రకటించిన జిల్లాలలో షాపులను మూసివేసి వాహనాలను కూడా అడ్డుకుంటున్నారు గిరిజన సంఘాల నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news