రాష్ట్రంలోని రాజకీయ నాయకులు నైతిక విలువలను పాటించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
దారిద్య్ర రేఖకు దిగువన, ఎగువన ఉన్న వారి వివరాలు సేకరించి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సూచించినట్లు తెలిపారు.పార్టీ ఫిరాయింపులపై ఆయన స్పందిస్తూ ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. రాజకీయ నాయకులు నైతిక విలువలు పాటించాలని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అప్పుడే వారికి భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు.