సర్పంచ్ ఎన్నికల్లో ప్రస్తుతం కోతుల పంచాయితీ హాట్ టాపిక్ అవుతోంది. సాధారణంగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోడ్లు వేయిస్తామని, నీళ్ల సమస్యలు తీరుస్తామని, డ్రైనేజీ సమస్యలను చెక్ పెడతామని, బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని వాగ్దానాలు చేస్తుంటారు.
కానీ, రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కోతుల బెడదను తప్పించిన వారికే అధికారం కట్టబెడతామని ప్రజలు చెబుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే రాష్ట్రంలో కోతులు అడవులను వీడి ఊర్ల మీదకు వచ్చేస్తున్నాయి. ఫలితంగా రైతులు పంటలు నష్టపోతున్నారు.అదేవిధంగా సామాన్య జనం కోతుల వలన గాయాల పాలవుతున్నారు. అందుకే వాటిని తరిమి తమకు రక్షణ కల్పిస్తామని భరోసా కల్పించినవారికే మద్దతు ఇస్తామని ఊర్లర్లో జనాలు ప్రకటస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల కోతులు ఉన్నట్లు అంచనా. గతంలో జగిత్యాలలోని కోడిమ్యాలలో కోతుల బెడద నివారిస్తామని ప్రకటించిన ఒకరిని భారీ మెజార్టీతో ప్రజలు సర్పంచ్‌గా గెలిపించారు.