కుంభమేళాలో భారీ ట్రాఫిక్ చోటు చేసుకున్న తరుణంలో యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది యో గి సర్కార్. ఈ రోజు నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. ఇవాళ సాయం త్రం 5 గంటల నుంచి ప్రయాగ్ రాజ్ మొత్తం నో వెహికల్ జోన్‌గా మారుస్తామని అధికారులు తెలిపారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/01/yogi.jpg)
కాగా, మహా కుంభమేళాకు వెళ్లే వారికి బిగ్ అలర్ఠ్. మహా కుంభమేళాలో భారీ ట్రాఫిక్ చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్ జామ్‌తో రద్దీగా మారిపోయాయి. మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి జనాలు వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే… మహా కుంభమేళాలో భారీ ట్రాఫిక్ చోటు చేసుకుంది. దీంతో 100 నుంచి 300 కి.మీ వరకు వాహనాలు బారులు తీరాయి.