రైతులతో హరీశ్ రావు సెల్ఫీ.. పొద్దు తిరుగుడుకు మద్దత ధర కల్పించాలని డిమాండ్

-

సిద్ధిపేట జిల్లాలోని రైతులతో మాజీ మంత్రి హరీశ్ రావు ముచ్చటించారు. తన నియోజకవర్గంలో పర్యటించిన ఆయన..చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రైతులతో కలిసి రంగనాయక సాగర్ కాలువను పరిశీలించారు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి సంతోషించారు. రైతులకు సాగునీరు అందడంపై హర్షం వ్యక్తం చేస్తూ, కాలువ పక్కన ఆగి సెల్ఫీ రైతులతో కలిసి దిగారు.ఆ తర్వాత అక్కడి రైతులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మెట్టుపల్లి గ్రామంలోని పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) తోటలను సందర్శించి రైతులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న మార్కెటింగ్ సమస్యలు, పంటకు సరైన మద్దతు ధర లేదని హరీశ్ రావు దృష్టికి తీసుకురాగా.. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సన్‌ఫ్లవర్ పంటకు మద్దతు ధర (MSP) కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news