కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ అకస్మిక పర్యటన రద్దు అయింది. పార్లమెంట్ లో కీలక బిల్లులు పై చర్చలో రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉన్నందునా తెలంగాణలో ఈరోజు నిర్వహించాల్సిన తన పర్యటన రద్దు చేసుకున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అంతకు ముందుగా వెల్లడైన సమాచారం మేరకు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా హన్మకొండలో పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో సమావేశం కావాల్సి ఉంది.
రాత్రి 7.30 గంటలకు చెన్నైకి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు లో కాజీపేట నుంచి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వివరాలను మంగళవారం ఉదయం వరకు కూడా అధికారికంగా ప్రకటించలేదు. చివరికీ పార్టీ ముఖ్య నాయకులకు కూడా ఆయన పర్యటన షెడ్యూల్ వివరాలను వెల్లడించకపోవడం ఆసక్తిరేపింది. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన అకస్మికంగా ఖరారైనట్టుగా అదే స్థాయిలో రద్దయిపోవడం కాంగ్రెస్ వర్గాలను సైతం అయోమయానికి గురి చేసింది.