సెల్ఫోన్ వాడొద్దన్నందుకు ఓ మైనర్ బాలుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మియాపూర్ – న్యూ హాఫిజ్పేటలో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. మార్తాండ నగర్లో ఉండే బల్వంత్ సింగ్ కొడుకు శౌర్య సింగ్ (17) ఓపెన్ స్కూల్లో పదోవ తరగతి చదువుతున్నాడు.
ప్రతిరోజూ ఫోన్ ఎక్కువగా వాడుతున్నాడని తల్లిదండ్రులు మందలించేవారు.అలాగే నిన్న రాత్రి ఫోన్ వాడొద్దని తల్లి మందలించగా, తీవ్ర మనస్తాపానికి గురైన శౌర్య సింగ్ రాత్రి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే గమనించిన పేరెంట్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.